బాలయ్య, శర్వానంద్, నాని ఉగాది బరిలో
- March 19, 2017
బాలకృష్ణకు సంక్రాంతి పోటీనిచ్చాడు..! ఆ పోటీలో నెగ్గాడు..! మళ్లీ ఇప్పుడు అదే బాలయ్యతో ఉగాది బరిలో నిలుస్తున్నాడు..! ఉగాది బరిలోనూ నెగ్గుతాడా..? అటు సంక్రాంతి..ఇటు ఉగాదికి నటసింహంతో బరిలో నిలుస్తున్న ఆ యంగ్ హీరో శర్వానంద్. బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను బాగానే పిండుకుంది. అదే సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ శతమానం భవతి సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకాదరణ పొంది.. బాక్సాఫీస్ వద్ద మనగలిగింది. అంతేకాదు.. శర్వానంద్‌కు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా కూడా నిలిచింది. మరోసారి శర్వానంద్ బాలయ్యతో ఉగాది రేసులో నిలిచాడు. ప్రస్తుతం శర్వానంద్ కొత్త సినిమా రాధ చేతిలో ఉంది.
వాస్తవానికి 29న విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. బాలయ్య కొత్త సినిమా మొన్ననే ప్రారంభమైంది. మరి, బాలయ్యతో శర్వానంద్ పోటీ ఎలా ఉంటుందన్న ప్రశ్న రావొచ్చు. కానీ, బిగ్ స్క్రీన్‌పై గౌతమిపుత్ర శాతకర్ణికి శతమానం భవతితోనే పోటీనిచ్చిన శర్వానంద్..
బుల్లితెరపైనా పోటీనిస్తున్నాడు. ఉగాది పర్వదినాన పలు చానెళ్లు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి, నాని జెంటిల్మెన్ సినిమాలు టీవీల్లో రాబోతున్నాయి. మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.
మరి, బుల్లితెరపై ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో.. ఏ సినిమాకు ఎక్కువ టీఆర్పీ వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







