'కాటమరాయుడు' తో మూడో విజయం మా ఫ్యామిలీకి: చరణ్

- March 20, 2017 , by Maagulf
'కాటమరాయుడు' తో మూడో విజయం మా ఫ్యామిలీకి: చరణ్

అవంతి శ్రీనివాసరావు కుటుంబంతో ఉన్న అనుబంధం వల్లే ఇక్కడకు వచ్చానని ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌ అన్నారు. కళాశాల వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మెగా ఫ్యామిలీతో ఎన్నో ఏళ్ల నుంచి 'అవంతి' అనుబంధం కలిగి ఉన్నారన్నారు. కళాశాలను ఏర్పాటు చేసి సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించడమంటే సాధారణ విషయం కాదన్నారు. ఏ ఫంక్షనకు వెళ్లకపోయినా విద్యార్థుల ఫంక్షనకు తప్పనసరిగా వెళతానన్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్నా... మీ సంకల్పం వల్లే ఇక్కడకు వచ్చానన్నారు. ఎవరూ చూపించనంత ప్రేమ, ఆప్యాయతలను యువత తమ కుటుంబంపై చూపిస్తోందన్నారు. 'కాటమరాయుడు' ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందని, సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుందన్నారు.
గత ఏడాది ధృవ, ఈ ఏడాది ఆరంభంలో ఖైదీ 150, ఉగాదికి 'కాటమరాయుడు'తో తమ కుటుంబానికి విజయానందాలను అభిమానులు అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 'నా దేవుడు మెగాస్టార్‌ చిరంజీవి' ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చి శాససభ్యున్ని చేస్తే, గత ఎన్నికల్లో పవర్‌స్టార్‌ పవనకల్యాణ్‌ అనకాపల్లిలో ప్రచారం నిర్వహించి ఎంపీని చేశారన్నారు. మెగా ఫ్యామిలీతో ఎప్పటినుంచో అనుబంధం ఉందన్నారు. పులి కడుపున పులే పుడుతుందనడానికి రామ్‌చరణే నిదర్శనమన్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో రాణిస్తూనే, తండ్రిని సినిమాల్లోకి తీసుకురావడమే కాకుండా అఖండ విజయాన్ని అందించారని కొనియాడారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటే ఎలా ఉంటుందో చూపించారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com