కుటీరం 23 సక్సెస్ మీట్
- March 20, 2017
చాలా గ్యాప్ తరువాత 'కుట్రమ్ 23'తో హీరోగా భారీ సక్సెస్ అందుకున్న అరుణ్ విజయ్‌పై ఇటు ప్రేక్షకుల నుంచి అటు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అన్నింటికన్నా తన తండ్రి (విజయ్‌కుమార్) ప్రశంసలు తనకెంతో ఆనందాన్నిచ్చాయని, ఆయన మాటలు తనకు గొప్ప అవార్డుతో సమానమని చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అరుణ్ విజయ్ పేర్కొన్నాడు. ఇటీవలే ఎంజీఆర్ డీమ్డ్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా విజయ్‌కుమార్‌ను 'కుట్రమ్ 23' చిత్ర బృందం గజమాలతో సత్కరించింది. ఆయన సాధించిన విజయాలతో పోలిస్తే తను సాధించింది పది శాతం కూడా లేదని అరుణ్ విజయ్ తన తండ్రి పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.
కాగా, 'ఈరం' ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో మెడికల్ క్రైం డ్రామాగా తెరకెక్కిన 'కుట్రమ్ 23' తెలుగులోను విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







