మీకు నచ్చిన నెంబర్‌, మీ ఇంటి నుంచే!

- March 20, 2017 , by Maagulf
మీకు నచ్చిన నెంబర్‌, మీ ఇంటి నుంచే!

ఎటిసలాట్‌, తమ పోస్ట్‌ పెయిడ్‌ సబ్‌స్క్రైబర్స్‌ కోసం ఓ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇంట్లోంచే, మీక్కావాల్సిన నెంబర్‌ని ఎంచుకోవచ్చు. స్పెషల్‌, గోల్డ్‌, ప్లాటినం మొబైల్‌ నెంబర్స్‌ని ఎంపిక చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఆన్‌ లైన్‌ ద్వారా ఔత్సాహికులు తాము కోరుకున్న స్పెషలైజ్డ్‌ నెంబర్‌ని సెలక్ట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎటిసలాట్‌ ఆఫీస్‌కి వెళ్ళకుండా, 'క్రియేట్‌ యువర్‌ ఓన్‌ నెంబర్‌' సర్వీస్‌ని ఎటిసలాట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. 1.2 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌ గల ఎటిసలాట్‌, ఆన్‌లైన్‌ ద్వారా బిల్లుల చెల్లింపు, అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించింది. తమ పుట్టినరోజు ఆధారంగా, అలాగే యానివర్సరీ, ఇతర ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ ద్వారా నెంబర్‌ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం పట్ల వినియోగదారులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెంబర్‌ ఎంపిక చేసుకున్న తర్వాత, ఆన్‌లైన్‌లోనే పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com