సంగీతం నృత్య నాటక కార్యక్రమాలతో అలరించిన కళావందనం 2017

- March 20, 2017 , by Maagulf
సంగీతం నృత్య నాటక కార్యక్రమాలతో అలరించిన  కళావందనం 2017

 పరస్పర సంబంధాల జట్టు సహకారంతో ఈ నెల మార్చి17 వ తేదీన కళావందనం 2017 ఘనంగా నిర్వహించారు. సంగీతంతో కూడిన ఈ  నృత్యోత్సవం ఇండియన్ అసోసియేషన్ షార్జా మరియు ట్రావెన్కోర్ మలయాళీ కౌన్సిల్ పరస్పర సంబంధాల జట్టు ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య సంగీత నిర్వహణకు వివిధ చర్యలు తీసుకొన్నారు. సంభాషణ లేని మూకీ నాటకం పిల్లలను విపరీతంగా ఆకట్టుకొంది.అదేవిధంగా పెద్దలు పాత్రధారులుగా సామాజిక అవగాహన కల్గించే నాటకానికి ప్రేక్షకులు ప్రశంసలు లభించాయి.సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో జెఎంఎం గ్రూప్ స్థాపకుడు అధినేత మరియు సీఈఓ  శ్రీ జసిం హసన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం సినిమా పాటలతో కూడిన నృత్యాలతో వీక్షకులకు కనువిందు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com