విమానాశ్రయంలో కుప్పకూలిన విమానం

- March 20, 2017 , by Maagulf
విమానాశ్రయంలో కుప్పకూలిన విమానం

దక్షిణ సూడాన్‌లో విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో కనీసం 44 మంది ఉన్నట్టు సమాచారం.ప్రయాణికుల క్షేమం గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా మరికొన్ని వార్త సంస్థలు చాలామంది ప్రయాణికులు గాయపడినట్టు మాత్రమే పేర్కొన్నాయి. ఈ విమానం ఎక్కడికి వెళ్తోంది, ప్రమాదానికి కారణమేంటన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com