డొమెస్టిక్‌ వర్కర్లను పరిరక్షించండి: బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌

- March 20, 2017 , by Maagulf
డొమెస్టిక్‌ వర్కర్లను పరిరక్షించండి: బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌

మనామా: బహ్రెయినీ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, డొమెస్టిక్‌ వర్కర్ల హక్కుల్ని పరిరక్షించాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బహ్రెయిన్‌ చట్టం, డొమెస్టిక్‌ వర్కర్లను రక్షించడంలో అనుకున్నంతగా ఉపయుక్తంగా లేదని, ముఖ్యంగా మహిళా కార్మికులకు సంబంధించి సమస్యల పరిష్కారం కావడంలేదని బహ్రెయిన్‌ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌) జనరల్‌ సెక్రెటరీ ఫులాద్‌ చెప్పారు. బహ్రెయిన్‌లో మొత్తం 85000 మంది డొమెస్టిక్‌ వర్కర్లకు భద్రత లేకుండా పోయిందని ఫులాద్‌ చెప్పారు. కొన్ని కేసుల్లో రోజుకి 15 గంటల పాటు పనిచేస్తున్న కార్మికులున్నారనీ, వారికి తగిన జీతం రావడంలేదని, అదే సమయంలో వారు తీవ్రమైన మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేధింపులు దూషణలు వారికి తప్పడంలేదని ఫులాద్‌ పేర్కొన్నారు. వాస్తవాల్ని గ్రహించి డొమెస్టిక్‌ వర్కర్స్‌ని ఆదుకునేందుకు చట్టాల్ని మరింతగా మెరుగు పర్చుకోవాలని బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌ ప్రభుత్వానికి సూచనలు చేసింది. బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌, బహ్రెయిన్‌ని సిఎస్‌డబ్ల్యు61 (యుఎన్‌ ఫోరం) నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com