డొమెస్టిక్ వర్కర్లను పరిరక్షించండి: బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్
- March 20, 2017
మనామా: బహ్రెయినీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, డొమెస్టిక్ వర్కర్ల హక్కుల్ని పరిరక్షించాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బహ్రెయిన్ చట్టం, డొమెస్టిక్ వర్కర్లను రక్షించడంలో అనుకున్నంతగా ఉపయుక్తంగా లేదని, ముఖ్యంగా మహిళా కార్మికులకు సంబంధించి సమస్యల పరిష్కారం కావడంలేదని బహ్రెయిన్ హ్యూమన్ రైట్స్ వాచ్ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్) జనరల్ సెక్రెటరీ ఫులాద్ చెప్పారు. బహ్రెయిన్‌లో మొత్తం 85000 మంది డొమెస్టిక్ వర్కర్లకు భద్రత లేకుండా పోయిందని ఫులాద్ చెప్పారు. కొన్ని కేసుల్లో రోజుకి 15 గంటల పాటు పనిచేస్తున్న కార్మికులున్నారనీ, వారికి తగిన జీతం రావడంలేదని, అదే సమయంలో వారు తీవ్రమైన మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేధింపులు దూషణలు వారికి తప్పడంలేదని ఫులాద్ పేర్కొన్నారు. వాస్తవాల్ని గ్రహించి డొమెస్టిక్ వర్కర్స్‌ని ఆదుకునేందుకు చట్టాల్ని మరింతగా మెరుగు పర్చుకోవాలని బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్, బహ్రెయిన్‌ని సిఎస్డబ్ల్యు61 (యుఎన్ ఫోరం) నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







