ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌

- March 20, 2017 , by Maagulf
ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌

షార్జా క్రికెట్‌ స్టేడియంలో జరిగిన లైవ్‌ కాన్సెర్ట్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, ఆహూతులైన 20,000 మందిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు, తన పాటలతో హోరెత్తించారు. షార్జాలో తొలిసారిగా ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకుల్ని అభినందించారాయన. ఎల్‌ఈడీ స్క్రీన్లతో ఆహూతులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఎక్కువగా మలయాళ, తమిళ పాటలతో హోరెత్తించారు రెహమాన్‌. మూడ గంటల పాటు సాగిన ఈ షో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. దిల్‌సె, ఏ జో దేష్‌ హై మేరా, చయ్యా చయ్యా, ముస్తఫా ముస్తపా, జనగనమన వంటి పాటల్ని ఆలపించిన రెహ్మాన్‌, ఆహూతులు కూడా తనతో గొంతు కలిపేలా, పాదం కలిపేలా చేయగలిగారు. మధ్య మధ్యలో శ్వేతా మోహన్‌, కార్తీక్‌, మెన్నీ దయాల్‌, రంజిత్‌ బరోత్‌, హరిహరన్‌, జోనితా గాంధీ, నీతి మోహన్‌, ఆల్ఫాన్స్‌ జోసెఫ్‌, జావెద్‌ అలి తదితరులు వేదికపై సందడి చేశారు. మనసు మనసింతే పాటతో, తన తండ్రి ఆర్‌కె శేఖర్‌కి నివాళులర్పించారు రెహమాన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com