తెలుగువారిపై దాడి బెంగళూరులో
- March 20, 2017హాస్టళ్లలో ఉండే ఐటీ నిపుణులే లక్ష్యం
మున్నేకొలాలలో 50 మందికి గాయాలు
బెంగళూరులో తెలుగు బ్యాచ్‌లర్ ఐటీ నిపుణులు అధికంగా ఉండే మున్నేకొలాల ప్రాంతంలో విద్వేష దాడి జరిగింది. పేయింగ్ గెస్ట్ హాస్టళ్లలో ఉంటున్న తెలుగు యువకులను లక్ష్యంగా చేసుకొని శనివారం రాత్రి దాడి చేశారు. ఇక్కడి హాస్టళ్లలో ఇరు రాష్ట్రాలకు చెందిన దాదాపు ఆరు వేల మంది తెలుగు ఐటీ నిపుణులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి కాలనీలో బైకుపై నిర్లక్ష్యంగా వెళుతున్న ఇద్దరు స్థానిక యువకులు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న తెలుగు ఐటీ నిపుణుడిని ఢీకొట్టారు.
దాంతో ఆగ్రహించిన అతను వారితో వాగ్వాదానికి దిగాడు. బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఎంత ధైర్యమంటూ అతన్ని కొడుతూ తెలుగులోనే అతన్ని, తెలుగువారిని ఘోరంగా దుర్భాషలాడారు. చుట్టుపక్కల గుమిగూడిన జనం ఆ స్థానికులిద్దర్నీ కొట్టి పంపించారు. ఆ తర్వాత తెలుగు వాళ్లంతా ఏం జరుగుతుందోనన్న భయంతో హాస్టళ్లలోనే ఉండిపోయారు.
అనుమానించినట్లుగానే అదే రాత్రి 40 మంది స్థానికులు కర్రలతో వచ్చి తెలుగువారికి హెచ్చరికలు చేస్తూ రాత్రంతా కాలనీలో గస్తీ తిరిగారు. మర్నాడు శనివారం రాత్రి మరింత మంది యువకులు కార్లలో వచ్చి కాలనీలో అన్ని ఇళ్లలో లైట్లు బంద్ చేయించారు. తర్వాత ప్రతీ హాస్టల్ రూమ్ తిరిగి అనుమానం వచ్చిన వాళ్లందర్నీ తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో దాదాపు 50 మంది తెలుగువాళ్లు గాయపడ్డట్లు సమాచారం.
ఈ దాడితో తెలుగు వారు బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం అందించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. పోలీసులు కూడా ఆ పక్కకు రాలేదు. సోమవారం ఉదయం ఆఫీసులకు బయల్దేరే వరకూ మున్నేకొలాలలోని తెలుగు వారెవరూ భయంతో కనీసం తలుపులు తీయలేదు.
అన్ని ఐటీ కార్యాలయాల్లోనూ సోమవారం ఇదే చర్చ. సాధారణంగా బెంగళూరులో కన్నడిగులు తెలుగువాళ్లతో స్నేహంగా ఉంటారు. మున్నేకొలాలలో ఏడాదికాలంగా స్థానిక యువతకు, తెలుగు ఐటీ యువతకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహే్‌షబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణల సినిమాల విడుదల సందర్భంగా కొందరు తెలుగు వాళ్లు చేసే హడావుడి అక్కడి వాళ్లకు నచ్చడం లేదని అంటున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







