కామెల్ కాన్వాయ్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా
- March 20, 2017
తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో 9 కిలోమీటర్ల మేర కామెల్ కాన్వాయ్‌లో 400 మంది పాల్గొన్నారు. నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలోని ఖబౌరాలో గల వాడి అల్ హవ్స్నా నుంచి ఈ ట్రిప్ ప్రారంభమయ్యింది. రిటైర్డ్ మేజర్‌జనరల్ సైద్ బిన్ నాజర్ అల్ సల్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్ పరిధిలోని పలు గవర్నరేట్స్కి చెందిన పలువురు ఈ కాన్వాయ్‌లో పాల్గొన్నారని నాజర్ అల్ హోస్ని అనే పార్టిసిపెంట్ చెప్పారు. వీరిలో యూకే మరియు యుఎస్ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిథులు కూడా ఉన్నారు. 9 కిలోమీటర్ల ఈ యాత్రను పూర్తి చేయడానికి 3 గంటల సమయం పట్టింది. అత్యంత క్లిష్టతరమైన ఈ రవాణా మార్గంలో తమ పూర్వీకులు పడ్డ కష్టం గురించి యాత్రలో పాల్గొన్నవారంతా తెలుసుకున్నారు. డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయనీ, ఈ టూర్ ప్రతి యేడాదీ కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని హోస్నీ చెప్పారు. కార్లో ముందుగా గమ్యాన్ని చేరుకున్న ఇద్దరు ఒమనీయుల్ని మేజర్ జనరల్ సల్మి సత్కరించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







