అమెరికా ఆంక్షలు వివిధ దేశాలనుంచి వచ్చే ముస్లింలపై
- March 22, 2017
ఉగ్రవాద దాడి ముప్పు దృష్ట్యా ముస్లింల జనాభా అధికంగా ఉండే వివిధ దేశాల నుంచి తమ దేశాలకు విమానాల్లో వచ్చే వారిపై భద్రతాపరమైన ఆంక్షలను అమెరికా, బ్రిటన్ కఠినతరం చేశాయి. అమెరికా ఎనిమిది దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై, బ్రిటన్ ఆరు దేశాల నుంచి వచ్చే వారిపై తాజా ఆంక్షలను విధించాయి. సౌదీ అరేబియా, ఈజిప్టు. టర్కీ,జోర్డాన్, యూఏఈ, ఖతార్, మొరాకో, కువైట్‌ల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐపాడ్లు, ఈ-రీడర్లు, కెమెరాలు, పెద్దగా ఉండే ఇతర ఎలక్ట్రానిక్ సాధనాలను విమానంలో క్యాబిన్ లగేజీ గా వెంట ఉంచుకునేందుకు వీల్లేదని ప్రకటించింది. వీటిని కార్గో భాగంలో ఉంచుతారు. ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ఈ విషయమై ఉత్తర్వు జారీ చేసింది. అమెరికాకి వచ్చే 50కి పైగా విమానాలపై ఉత్తర్వు ప్రభావం వుంటుంది. నిర్దేశిత పరిమాణాన్ని మించి ఉండే ఫోన్లు, ట్యాబ్‌లు, డీవీడీ ప్లేయర్లపైనా ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







