'బాహుబలి'లో ఏముంది : కైకాల సత్యనారాయణ
- March 22, 2017
ప్రపంచమంతా 'బాహుబలి' రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా కీర్తిని పొందింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంత కంటే భారీ కలెక్షన్లు సాధించింది. ఇలాంటి సినిమాను తేలిగ్గా తీసిపడేశారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. అసలు 'బాహుబలి' సినిమాలో ఏముంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'బాహుబలి' గురించి మాట్లాడారు. 'నేను 'బాహుబలి' సినిమా చూశాను. ఏముంది అందులో. కథగా చెప్పుకోవడానికి అసలేముంది. ఆ సినిమా గురించి చాలా సింపుల్‌గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చు.
భారీ సెట్లు, గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయి. మా రోజుల్లో వాటిని 'ట్రిక్స్' అనే వాళ్లం. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి 'గ్రాఫిక్స్' అంటున్నారు. మన మార్కెట్‌కు ఐదొందల కోట్లు పెట్టాల్సిన అవసరముందా?.
ఆ బడ్జెట్‌తో ఐదొందల సినిమాలు చేసుకోవచ్చు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్ వాళ్లు ఎప్పుడో తీశారు. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో చూశాం. బోలెడు ఖర్చుపెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా?
మొన్న 'బిచ్చగాడు' అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది.
కళ్లు జిగేల్‌మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా' అని సత్యనారాయణ ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







