జర్నలిస్టుపై రోబో '2.0' యూనిట్‌ దాడి

- March 22, 2017 , by Maagulf
జర్నలిస్టుపై రోబో '2.0' యూనిట్‌ దాడి

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘2.0’ సెట్‌లో ఓ ఫొటో జర్నలిస్టుపై దాడి జరిగింది. దీంతో బాధిత జర్నలిస్టు ‘2.0’ యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ‘2.0’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు.
ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com