రెంట్స్ చెల్లించలేనివారి కోసం 1 మిలియన్ దిర్హామ్‌ల డొనేషన్
- March 22, 2017
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (డిఎల్‌డి) - జ్యుడీషియల్ ఆర్మ్ 1 మిలియన్ దిర్హామ్‌ల డొనేషన్‌ని లేట్ ఒబైద్ అల్ హెలోయు కుటుంబం నుంచి అందుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రెంట్స్ చెల్లించలేనివారి కోసం ఈ డొనేషన్‌ని వినియోగించనున్నారు. రెంటల్ డిస్‌ప్యూట్ సెంటర్ (ఆర్‌డిసి), ఓ కమిటీని ఏర్పాటు చేసి, రెంట్ వివాదాల్ని అధ్యయనం చేస్తుంది. ఈ సందర్భంగా ఆర్‌డిసి డైరెక్టర్ జడ్జ్ అబ్దుల్‌ఖాదర్ మౌసా మాట్లాడుతూ, లేట్ ఒబైద్ అల్ హెలోయూ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆర్‌డిసి ముఖ్య ఉద్దేశ్యం టెనెంట్స్‌కీ ల్యాండ్‌లార్డ్స్‌కీ మధ్య సానుకూల వాతావరణం సృష్టించడమేనని ఆయన చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న టెనెంట్స్‌కి మాత్రమే ఉపయోగపడేలా తమకు అందిన నిధుల్ని ఖర్చు చేస్తామని మౌసా చెప్పారు. ఇయర్ ఆఫ్ గివింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మౌసా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







