షమ్మాల్ రోడ్‌లో రువైస్ వద్ద రోడ్డు మూసివేత
- March 22, 2017
అల్ రువాయస్ ఇంటర్‌ఛేంజ్ (ఎన్93) - అల్ షమ్మాల్ రోడ్ నెల రోజులపాటు మూసివేయబడ్తుంది. శుక్రవారం నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. అల్ రువైస్ ఇంటర్‌ఛేంజ్ అలాగే వైస్ వెర్సా నుంచి ఎంట్రన్స్‌లు, ఎగ్జిట్‌లు అన్నీ మూసివేయబడ్తాయని అష్గల్ పేర్కొంది. అల్ షమ్మాల్ రోడ్‌పై రెండు వైపులా ట్రాఫిక్ యధాతథంగా అనుమతించబడ్తుంది. మూసివేత సమయంలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ని తాత్కాలిక రోడ్లపైకి మళ్ళిస్తారు. ఈ మధ్యనే నిర్మించిన రోడ్లపై ఈ ట్రాఫిక్‌ని అనుమతించడం జరుగుతుంది. మళ్ళింపులకు సంబంధించి పూర్తి మ్యాపింగ్‌లను కూడా విడుదల చేశారు. రౌండెబౌట్స్ వంటివాటి నిర్మాణం కోసం ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు సహకరించాలనీ, రోడ్ డైవర్షన్లను పాటించాలనీ, వేగ నియంత్రణ తప్పనిసరని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







