బాహుబలి2 సినిమా దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్స్‌పై విడుదలకు భారీ సన్నాహాలు
- March 23, 2017
బాహుబలిలో రేకెత్తించిన సందేహాలకు సమాధానాలు తెలియాలంటే బాహుబలి2 చూడాల్సిందేనంటున్నాడు చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. బాహుబలి2 ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచాడు జక్కన్న. దీంతో ఏప్రిల్ 28 కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలను అందిపుచ్చుకోవడానికి చిత్ర నిర్మాతలు సినిమా విడుదలకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బాహుబలి2ను 6,500 స్క్రీన్స్‌లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాదు మరో వెయ్యి స్క్రీన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ట్రైలర్‌కు ఊహించని రీతిలో స్పందన రావడంతో నిర్మాతలకు సినిమా కలెక్షన్లపై మరింత నమ్మకం పెరిగింది.
దీంతో మొదట అనుకున్న స్క్రీన్స్ కంటే ఇంకొన్ని పెంచినట్లు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బాహుబలి2 ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఒక భారతీయ సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుండటం ఇదే తొలిసారి అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







