ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల ఉత్సవం.. 2 మిలియన్ సందర్శకుల రాక
- March 23, 2017
రియాద్ కు ఈశాన్య వైపున120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమాహ్ లో మంగళవారం ఒక ఆహ్లాదకరమైన నులివెచ్చని వాతావరణంతో కింగ్ అబ్దుల్ అజిజ్ ఒంటెల ఉత్సవం ప్రారంభమై సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు జరిగే ఈ ఒంటెల పండుగని చూసేందుకు వచ్చేవారి సంఖ్య ఈ ఏడాది అధికంగా ఉండొచ్చని ఉత్సవ నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం 2 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఉత్సవంకు వస్తారని భావిస్తున్నారు.వివిధ గల్ఫ్ దేశాల నుంచి 1,390 మంది ఒంటెల యజమానులు ఈ పోటీలో పాల్గొనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంగా అభివర్ణించవచ్చని ఈ పండుగ యొక్క ప్రతినిధి డాక్టర్ తలాల్ బిన్ ఖాలిద్ అల్ తొరిఫ్య్ చెప్పారు. పురాతన సాంప్రాయాదాయక వారసత్వం గూర్చి కొత్త తరాల వారికి అనుసంధానిస్తుందని సౌదీ అరేబియా విజన్ 2030 కు ఈ కార్యక్రమం ఒక ప్రేరణ మరియు ప్రతిబింబం వలె పనిచేస్తుంది, ఆ దిశలో ఈ సంవత్సరం పండుగ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు ఈ ఏడాది పండుగ నినాదం " ఒంటెలు నాగరికత కల్గి ఉన్నాయి." ఈ ఒంటెల పోటీలో జాతి మరియు రంగుతో సహా ఐదు రకాల వివిధ తరగతులలో న్యాయమైన తీర్పు ఇవ్వబడి విజేతలైన వారికి మొత్తం 270 బహుమతులను అందిస్తుంది. ఈ ముగింపు వేడుక ఏప్రిల్ 15 వ తేదీన జరుగనున్నట్లు నిర్వాహకులు అల్ తొరిఫ్య్ తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







