నాది సినిమాలో గ్లామర్ పాత్ర కాదు: శ్రీముఖి
- March 23, 2017
హాట్..హాట్ లుక్స్‌తో బుల్లితెరపై మాంచి ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ముందే ఉంటుంది. యాంకర్ రవితో ముడిపెడుతూ కొన్ని వివాదాలు కూడా అమ్మడి మెడకు చుట్టుకున్నాయి. బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్తుతం దూసుకెళ్తోంది శ్రీముఖి. బుల్లితెరపైనే కాదు.. అవకాశం వచ్చినప్పుడల్లా పెద్ద తెరపైనా తళుక్కున మెరుస్తోంది ఈ హాట్ యాంకర్. అయితే.. ఇప్పటిదాకా వెండితెరపై ఆమె చేసింది చిన్నా..చితకా కేరెక్టర్లే. తాజాగా ఓ ఫుల్ఫ్లెడ్జ్డ్ పాత్రలో నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ మూవీ 'బాబు బాగా బిజీ'లో చాన్స్ కొట్టేసింది. హిందీ అడల్ట్ కామెడీ సినిమా 'హంటర్'కు రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాలో శ్రీముఖి హాట్..హాట్ సీన్లు చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు.
అవన్నీ వట్టి..మాటలే అని కొట్టిపారేసింది శ్రీముఖి. దానిపై క్లారిటీ ఇచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు తాను సినిమాలో గ్లామర్ పాత్రలో నటించలేదని, ఆ ప్రచారమంతా అబద్ధమని శ్రీముఖి చెప్పింది. సినిమాలో తనది గౌరవప్రధానమైన పాత్ర అని, హీరోకు బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో చెప్పే పాత్ర చేశానని తెలిపింది.
అయితే.. ఆమె చెబుతున్నదానికి పోస్టర్లలో చూపిస్తున్నదానికి మాత్రం పొంతన లేదని చర్చించుకుంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు ఉన్నట్టు చూపిస్తున్నారని అంటున్నారు. మరి, ఇందులో ఏది నిజమన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







