ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు హీరోలతో బోయపాటి సినిమా

ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు హీరోలతో బోయపాటి సినిమా

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను.. అసలు బోయపాటి శ్రీను సినిమా అంటేనే.. భారీ తారాగణం.. భారీ సెటింగ్స్.. పాత్ర చిన్నదైనా సరే ఆ పాత్ర కధను ప్రభావం చేస్తుంది అనుకొంటే.. ఆ పాత్రల కోసం బోయపాటి బాగా తెలుసున్న నటీనటులనే ఎంచుకొంటాడు. తాజాగా బోయపాటి శ్రీను బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోలు.. ఆరుగురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం,... అంటే.. ఈ సినిమాలో శ్రీనివాస్ తో కలిపి వివిధ పాత్రలు కోసం మొత్తం ఆరుగురు హీరోలు, ప్రధాన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లను నటింపజేస్తున్నాడట. శ్రీనివాస్ కాకుండా ఒకప్పుడు హీరోలుగా చేసిన జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్ లతో పాటు ఈ తరం హీరోలు నందు, శశాంక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల లో రకుల్ కాకుండా మరొక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, ఐటెమ్ సాంగ్ లో కేథరిన్ చేస్తోండగా... కీలక పాత్రలో అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్, సితార లతో పాటు "భీమవరం బుల్లోడు" ఫేమ్ ఎస్తర్ నొరోన్హా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశాలో ఉన్న ఈ సినిమాను ద్వారకా క్రియెషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. 

Back to Top