ఏకంగా 60కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు పక్కా ప్లాన్ చేసి
- March 24, 2017
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 కేజీల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పలాయంకొట్టాయ్‌లోని అలగర్ అనే నగల దుకాణంలో గురువారం రాత్రి దుండగులు ప్రవేశించి 60 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వీటి విలువ కోట్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం నుంచి నగల దుకాణం టెర్రస్‌పైకి వచ్చారని, గ్యాస్‌కట్టర్‌ల సహాయంతో గ్రిల్‌ను తెరిచి ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
చోరీ జరిగిన సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది దుకాణం ముందు విధుల్లో ఉండటం గమనార్హం.
శుక్రవారం ఉదయం సిబ్బంది నగల దుకాణం తెరిచి చూసినపుడు ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు క్లూస్‌టీంతోరంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నగల దుకాణం సిబ్బందితోపాటు పలువురిని ప్రశ్నిస్తున్నారు. దొంగలను గుర్తించేందుకు అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ భారీ చోరీ స్థానికంగా సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







