నేడు " ఎర్త్ అవర్ " ... భూ గ్రహం కోసం ఓ గంట !!

- March 25, 2017 , by Maagulf
నేడు

భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి. ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు. మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున రాత్రి 8.30 నుంచి 9.30 వరకు పవర్ కట్ చేసి ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు.ఎర్త్ అవర్ లో మనమూ భాగస్వాములం అవుదాం. కనీసం ఒక గంటపాటైనా కరెంట్ కట్ చేసి… కొన్ని లక్షల టన్నుల కాలుష్య కారకాలకు చెక్ పెడదాం. భూకంపాలకు కూడా గ్లోబల్ వార్మింగ్ కారణమని వారు నమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో మార్చ్ 25 వ తేదీ శనివారం రాత్రి గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పివేయనున్నారు. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు ఆయా దేశాల్లోని పలు వాణిజ్య సంస్థలు శనివారం రాత్రి 8.30 నుంచి 9.30గంటల వరకు భారీ విద్యుత్ దీపాలను నిలిపివేయనున్నాయి. అవసరమైన మేరకు చిన్నపాటి లైట్లతో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ సందర్భా న్ని పురస్కరించుకుని ఢిల్లీలోని చాలా హోట ళ్లు నిశీధి విందు పేరిట ప్రత్యేక కార్యక్రమా లు ఏర్పాటుచేశాయి. ఇంధన పొదుపు అవసరాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఎర్త్‌ అవ ర్‌కు ముహూర్తం ఖరారైంది.  ఈ గంట వ్యవధిలో అంతగా అక్కరకు రాని విద్యు త్‌ వస్తువుల వాడకాన్ని ఎర్త్‌ అవర్‌ మద్దతుదారులు నిలిపివేస్తారు. ఇది ఒక్కభారతదేశానికే పరిమితం కాదు. యావత్‌ ప్రపంచంలో అనేక దేశాలు వారి వారి కాలమా నాల ప్రకారం నిర్దేశిత 60 నిముషాల కాలంలో కరెంట్ వస్తువులను స్విచాఫ్‌ చేస్తారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ అవగాహన కార్యక్రమానికి ఎర్త్‌ అవర్‌ కేవలం వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే పరిమితం కాదు. దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలకమైన ఇండియా గేట్‌, రాష్ట్రపతి భవ న్‌, తదితర చోట్ల ఆ గంటసేపు విద్యుత్‌ దీపాలను ఆర్పి వేస్తారు. అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం, అటవీ, పర్యావ రణ మంత్రిత్వ శాఖ, ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌(డీ ఎంఆర్‌సీ), బీఎస్‌ఈ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎర్త్‌ అవర్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 24 నగరాలు ఈ భూమి కోసం ఓ గంట కేటాయించడానికి సంసిద్ధమవుతున్నాయి. మరి ఈ గంట లో వాళ్ళు ఏమి చేస్తారు? విద్యుత్తుని ఆపేస్తారు. వారి వారి ఇండ్లలో విద్యుత్తుతో నడిచే పరికరాలన్నిటినీ ఆపేస్తారు.దీని వల్ల ఏమవుతోంది. విద్యుత్తు వాడకం వల్ల కొన్ని పరికరాలు వదిలే గ్రీన్ హౌస్ వాయువులు  ఆ గంట పాటు వెలువడవు. అలాగే మనం ఎన్ని రకాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము అన్నది ఆలోచించవచ్చు. అదే విధంగా ఇప్పటికైనా మేలుకుని ఎన్ని రకాలుగా మనం ప్రకృతికి హాని కలగించకుండా జీవించచ్చు అన్నది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.స్థూలంగా ఆలోచిస్తే మనకు కరెంటు ఆదా అవుతుంది. టి వి రొద ఉండదు కనుక, ఫాను, ఏ సి వగైరాలు ఉండవు కనుక మనం మన కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడుపుతాము.ఆరు బయటకు వచ్చి ఆకాశాన్ని, చందమామని, నక్షత్రాలని చూస్తాము. కలుషితమైన గాలి ఉంటుంది. చెట్లు పెద్దగా కనపడకపోవచ్చు. అప్పుడు మెల్లిగా మన ఆలోచనలు మన బాల్యం వైపు మళ్ళుతాయి. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకొస్తాయి. వర్షాలు కురవాలంటే చెట్లు ఎంత అవసరం. చెట్లు మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. మనకు హానికరమైన కార్బన్ డై ఆక్సైడ్ ని అవి తీసుకుంటాయి.చెట్లెక్కి ఆడుకోవడం, చెట్ల నీడన సేద తీరడం ఇవన్నీ మన పిల్లలకి మనం అందిస్తున్నామా!! ఈ కాంక్రీట్ జనారణ్యాలలో వృక్షాలకు చోటు లేకుండా చేస్తున్నామా? మన బాధ్యత ఎంత?  ఇలా ఆలోచించవచ్చు. కొవ్వొత్తుల వెలుగులో అందరూ కలిసి భోజనం చేయచ్చు. సరదాగా పాటలు పాడుకోవచ్చు. అపార్ట్మెంటులోని సభ్యులందరినీ కూడగట్టి అందరూ పాల్గొనెలా ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు. చీకటి ద్వారా ప్రకృతి కోసం చిరు దీపాలు ఎలా వెలిగించవచ్చు అన్నది ఆలోచించి అమలు జరపచ్చు.ఏమైనా చేయచ్చు. ఓ ఆహ్లాదకరమైన మార్పు దిశగా మొదటి అడుగు వేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com