44 దొంగతనాలకి పాల్పడ్డ గ్యాంగ్‌ అరెస్ట్‌

- March 25, 2017 , by Maagulf
44 దొంగతనాలకి పాల్పడ్డ గ్యాంగ్‌ అరెస్ట్‌

రియాద్‌: 10 మంది సభ్యులు గల గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియాద్‌లో వీరిని అరెస్ట్‌ చేసినట్లు సిటీ పోలీస్‌ వెల్లడించారు. మొత్తం 44 దొంగతనాల్లో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు గ్రూపులుగా విడిపోయి ఈ గ్యాంగ్‌ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతోంది. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఏడుగురు సౌదీలు ఉండగా, ఓ సిరియన్‌, ఓ యెమెన్‌, ఇంకొకరు గుర్తు తెలియని దేశస్తుడు ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ళ వయసులోపలే ఉన్నారంతా. 4 సౌదీ రియాల్స్‌ విలువైన దొంగతనాలకు పాల్పడ్డారు వీరంతా. గోల్డ్‌ జ్యుయెలరీ, ఖరీదైన స్టోన్స్‌, ఎలక్న్రాటిక్‌ డివైజెస్‌, పర్సనల్‌ డాక్యుమెంట్స్‌, క్యాష్‌, లగ్జరీ కార్లను నిందితులు దొంగిలించారు. సిటీలో జరిగే ఎక్కువ దొంగతనాల్లో విదేశీయుల హస్తమే ఉంటోందని పోలీసులు వివరించారు. సెక్యూరిటీ అథారిటీస్‌ ఎప్పటికప్పుడు విస్తృతమైన తనఙఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకో వైపున అక్రమంగా దేశంలో ఉంటోన్నవారికి 90 రోజుల అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. మార్చ్‌ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com