నవ్వించే చిత్రం ‘సోడా గోళీ సోడా'
- March 27, 2017
మానస్, కారుణ్య, మహిమా అలేఖ్యా జంటగా నటిస్తున్న చిత్రం ‘సోడా గోళీ సోడా’. ఎస్‌బీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్నారు. హరిబాబు మల్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘సోడా గోళీ సోడా’ షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ…’ ప్రస్తుత సమాజంలో పరిస్థితుల నేపథ్యంలో ఓ మంచి సందేశంతో సోడా గోళీ సోడా సినిమాను నిర్మిస్తున్నాం. పూర్తిగా హాస్య భరితంగా సాగుతుంది. ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. పాలకొల్లు, హైదరాబాద్ లో టాకీ పార్టు పూర్తి చేస్తాం.’ అన్నారు.
నిర్మాత భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ…’ తెలుగు ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాలు తీసుకురావాలని నిర్మాణ రంగంలోకి వచ్చాం. మంచి టీం దొరికింది. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.’ అన్నారు. నటుడు మానస్ మాట్లాడుతూ…’ పేరులోనే శక్తి ఉంది.
కుటుంబం అంతా చూడగలిగే సినిమా. నా గత చిత్రాల్లాగే మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.’ అన్నారు. నటి కారుణ్య మాట్లాడుతూ…’నాకు ఇది మంచి అవకాశం. పాత్ర బాగుంది.
అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.’ అన్నారు.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







