కాలేజీ స్టూడెంట్స్ కోసం 'స్టూడెంట్ పార్కింగ్'
- March 26, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), స్టూడెంట్ పార్కింగ్ పేరుతో సబ్‌స్క్రిప్షన్ కార్డుల్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దుబాయ్ ఎమిరేట్‌లోని కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీస్ మరియు హయ్యర్ ఎకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన విద్యార్థులకు ముందుగా వీటిని అందిస్తారు. క్యాంపస్ నుంచి 500 మీటర్ల పరిధిలోని పార్కింగ్ స్లాట్స్‌ని విద్యార్థులు వినియోగించుకునేందుకు వీలుగా ఈ కార్డుల్ని రూపొందించినట్లు ఆర్‌టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజ్సె డైరెక్టర్ ఉసామా అల్ సఫి చెప్పారు. ఎ, బి, సి, డి కోడ్స్‌తో మూడు నెలలకుగాను 300 దిర్హామ్‌ల ఖరీదుతో ఈ కార్డులు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీ సర్టిఫికెట్ లేదా కాలేజీ గుర్తింపు కార్డు ద్వారా 'స్టూడెంట్ పార్కింగ్' కార్డ్స్‌ని పొందవచ్చు. ఒక కార్డు మీద అత్యధికంగా మూడు వాహనాల్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క వాహనం ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







