నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ కు 3 ఏళ్ళ జైలుశిక్ష

- March 27, 2017 , by Maagulf
నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ కు 3 ఏళ్ళ జైలుశిక్ష

రుని వేగంగా నిర్లక్ష్యంగా నడపడమే కాక తన ముందు వెళుతున్న వేరొక వాహననాన్ని డీ కొట్టి  ఆపై ఒక పోలీస్ అధికారిపై దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి అబూధాబీ కి చెందిన ఫస్ట్ ఇన్స్టాన్స్ క్రిమినల్ కోర్ట్  మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఎమిరేట్ వాసి అయిన ఆ డ్రైవర్ అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా వాహననాన్ని డ్రైవింగ్ చేయడమే కాక ముందు ప్రయాణిస్తున్న వేరొకరికి చెందిన కారుని ఢీ కొట్టి ధ్వంసం చేశాడు. పట్టుకోబోయిన ఒక పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. అధికారిక కోర్టు పత్రాల ప్రకారం ఆ ఎమిరేట్ యువకుని వయస్సు 20 ఏళ్ళు ఉంటుందని అబూధాబీ రోడ్లపై  వేగవంతం మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న ఒక యువకుడిని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత అబూ ధాబీ ట్రాఫిక్ గిస్తే అధికారులు తమ వాహనంలో ఆ కారుని వెంబడించారు. ఆ యువకుడు తన కారుని ఆపడానికి నిరాకరించి అందుకు బదులుగా మరింత వేగంతో  ప్రయాణించాడని పేర్కొంది. రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద  ట్రాఫిక్ జామ్ దగ్గర వేగంతో ముందుగా వెళుతున్న ఆ కారుని దాటాలనే యత్నంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి కుడి వైపు నుంచి దాటాలనే యత్నంలో ఆ కారుని డీ కొన్నాడు. కారు ధ్వంసం కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ్డాడు కానీ రెండవ డ్రైవర్ కు చెందిన కారు  దెబ్బతింది. ఎమిరేట్ యువకుడు తన కారు నుంచి కిందకు దూకి వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగు ప్రారంభించాడని దీనితో ఒక పోలీసు అధికారి పెట్రోల్ కారు దిగి ఆ యువకుని వెంటపడి పెట్టుకొనేందుకు ప్రయత్నించగా ఆ పెనుగులాటలో పోలీస్ అధికారిపై ఆ యువకుడు చేయి చేసుకున్నాడని ఆ తరవాత అదుపులోకి వచ్చినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. దీనితో కోర్టు న్యాయవాదులు సాక్ష్యం ఆధారంగా ఆ యువకుడిని దోషిగా నిర్ణయించి మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com