హైదరాబాద్ లో 'ఐఫా' కర్టెన్‌రైజర్‌

- March 27, 2017 , by Maagulf

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఈనెల 28,29 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. దక్షిణాది సినీపరిశ్రమకు సంబంధించి పురస్కారాలను ఈ వేడుకలో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం పార్క్‌హయత్‌ హోటల్‌లో కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీతారలు నాని, రానా, రాయ్‌లక్ష్మీ, ప్రగ్యాజైశ్వాల్‌, అక్షరహాసన్‌,శాన్వి తదితరులు హాజరయ్యారు. ఐఫా వేడుకకు టాలీవుడ్‌ నుంచి నాని, రానా వ్యాఖాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఓ కళాశాల వేడుకలా నిర్వహించనున్నామని, రానాతో కలిసి నవ్వుతూ అందర్నీ నవ్విస్తామన్నారు.
తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆనందంగా ఉందని నాని చెప్పుకొచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com