ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు

- March 28, 2017 , by Maagulf
ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు

ఉత్తరప్రదేశ్ లోని సంత కబీర్ నగర్ లోని రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో తక్కువ సామర్థ్యం ఉన్న నాటు బాంబు పేలిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఉగ్రవాదుల దాడికాదని అధికారులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com