500 కిలోలు వ్యక్తి 175 కిలోలు తగ్గాడు

- March 29, 2017 , by Maagulf
500 కిలోలు వ్యక్తి 175 కిలోలు తగ్గాడు

ప్రపంచంలోనే భారీ స్థూల కాయుడైన జువాన్‌ పెడ్రో ఫ్రాన్స్‌కో (32) ఎట్టకేలకు 175 కిలోల బరువు తగ్గాడు. ఈ విషయాన్ని అతనికి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న మెక్సికో డాక్టర్లు బుధవారం మీడియాకు తెలిపారు. 595 ​కిలోల బరువు ఉన్న జువాన్‌కు మూడు నెలలుగా చికిత్స అందించి గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ ఆపరేషన్‌కు సిద్దం చేశారు. ఈ ఆపరేషన్‌ మే 9 నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ జోస్ ఆంటోనియో కాస్తానేడ్‌ క్రజ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com