నాగశౌర్య చిత్రం సొంత బ్యానర్ లో
- March 29, 2017
"ఊహలు గుసగుసలాడే", "దిక్కులు చూడకు రామయ్య", "లక్ష్మిరావే మా ఇంటికి", "కళ్యాణవైభోగం"," జ్యోఅచ్చుతానంద" లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించిన నాగశౌర్య హీరోగా, కన్నడ లో "కిరిక్ పార్టి" అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అందరి మనసులు దొచుకున్న రష్మిక మండన్న హీరోయిన్ గా తెలుగుకి పరిచయం చేస్తూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన వెంకి కుడుముల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైనర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ఏప్రిల్ 10న పలువురు రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. తెలుగు ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతు ఈ చిత్ర వివరాలు నిర్మాతలు తెలియజేసారు.
ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరైన శంకర ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ.." మా అబ్బాయి నాగశౌర్య ని తో చిత్రాన్ని నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. త్రివిక్రమ్ గారి అసోసియోట్ వెంకి కుడుముల చెప్పిన కథ మాకు నచ్చి మా బ్యానర్ లోనే చేయ్యాలని నిర్ణయించుకున్నాము. వెంకి మాకు చాలాకాలం నుండి సుపరిచితుడు కావటం అతని టాలెంట్ ని మేము నమ్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాము. అలాగే కథకి సరిపోయోలా హీరోయిన్ ని ఎంచుకోవాలి అనుకుంటున్న సమయంలో కన్నడలో అతిపెద్ద విజయాన్ని సాధించిన కిరిక్ పార్టి ఫేం రష్మిక మండన్న ఎంచుకున్నాము. అప్పటికే దక్షిణాది సూపర్‌స్టార్స్ ఆమె డేట్స్ కొసం ఎంక్వరీలు స్టార్టయ్యాయి. మా సొంత బ్యానర్ లో నాగశౌర్య ని పెట్టి చిత్రాన్ని నిర్మిస్తున్నాము అంటే అది మంచి విజయాన్ని సాధించాలి నాగశౌర్యకి కెరీర్ మరో మెట్టు ఎక్కెలా వుండాలి అలాగే మా బ్యానర్ కి ఇది మంచి శుభారంభం కావాలి అనేది మనసులో గట్టి సంకల్పం పెట్టుకుని చేస్తున్నాము. ఏవిషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. కాలెజి బ్యాక్ డ్రాప్ లో వెరీ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాము. ఏప్రిల్ 10 న పలువురు ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ పూజాకార్కక్రమాలతో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు ఆరోజు తెలియజేస్తాం.. "అని అన్నారు
దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ.." నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన హీరో నాగశౌర్య గారికి , నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకరప్రసాద్ ముల్పూరి గారికి ధన్యవాదాలు. నాగశౌర్య కి జంటగా రష్మిక మండన్న నటిస్తుంది. హీరో నాగశౌర్య లుక్ అండ్ క్యారక్టరైజేషన్ కొత్తగా వుంటుంది. ప్రేక్షకులు నాగశౌర్య ని కొత్తగా చూస్తారు. ఫ్యామిలి అంతా వచ్చి చక్కగా నవ్వుకునే మంచి కామెడి ఈ చిత్రంలో వుంటుంది. ఈ చిత్రానికి సంగీతం- సాగర్ మహతి, సినిమాటొగ్రఫి- సాయి శ్రీరామ్. నిర్మాతలు- ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి, దర్శకత్వం- వెంకి కుడుముల.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









