సౌదీలో క్షమాభిక్ష కార్యక్రమంలో పాల్గొన్న APNRT కో-ఆర్డినేటర్స్
- March 29, 2017
తమ దేశ వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న విదేశీయులు ఏలాంటి జరిమానా లేదా జైలు శిక్ష లేకుండా స్వచ్ఛంధంగా స్వదేశాలకు తిరిగి వెళ్ళే క్షమాభిక్ష కార్యక్రమాన్ని సౌదీఅరేబియా ప్రారంభించింది. ప్రభుత్వం ప్రకటించిన 3 నెలలకు బుధవారం నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. మొదటిరోజు వేలాది మంది తెలుగు ప్రవాసీయులు ధరఖాస్తు చేసుకున్నారు.
స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న తెలుగు ప్రవాసీయులు ఎవరి వద్ద కూడా పాస్‌పోర్టులు లేకపోవడంతో రియాధ్, జెద్ధాలలోని భారతీయ దౌత్య కార్యాలయాలు వీరికి తాత్కలిక పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి. ఈ మేరకు సుదూర ఎడారి ప్రాంతాలలో కూడా భారతీయ దౌత్య బృందాలు పర్యటించి దరఖాస్తుదారులకు ప్రయాణ పత్రాలను జారీ చేస్తున్నాయి. భారత్‌కు వెళ్ళేవారి కోసం తాము 24 గంటలు సేవలందిస్తామని భారతీయ కాన్సల్ జనరల్ నూర్ రహేమాన్ షేక్ చెప్పారు. భారతీయ అధికారులు జారీ చేసిన పాస్‌పోర్టులను సౌదీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందజేయడంతోపాటు వేలి ముద్రలను సమర్పించిన తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి సౌదీ అధికారులు అనుమతిస్తారు.
మొదటి రోజు రియాధ్ నగరంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారని ఎపి ఎన్నార్టీ ప్రతినిధి, ప్రముఖ సామాజిక కార్యకర్త అంథోని రేవల్ చెప్పారు. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న తెలుగువారందరికి తాము వీలైన విధంగా సహాయం చేస్తామని దమ్మాంలోని ఎపి ఎన్నార్టీ ముఖ్య ప్రతినిధి రావి రాధకృష్ణా, జెద్ధా తెలుగు సంఘం అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







