పివిఆర్ సినిమాస్ లక్ష్యం రాబోవు ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు
- March 30, 2017
మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పివిఆర్ వచ్చే ఐదేళ్ల కాలంలో రాబడిని రెండింతలు పెంచుకుని 4 వేల కోట్ల రూపాయలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే కాలంలో స్ర్కీన్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 570 స్ర్కీన్లున్నాయని, వచ్చే నాలుగైదేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నామని పివిఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ తెలిపారు.
ఈ స్థాయికి చేరితే కంపెనీ రాబడి రూ.3,500-4,500 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పా రు. 2015-16 సంవత్సరంలో కంపెనీ రాబడి 1,743.98 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని సూద్ తెలిపారు. మూడేళ్ల కాలంలో స్ర్కీన్ల సంఖ్య ను పెం చడం వల్ల తమ థియేటర్లలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య ప్రస్తుతమున్న 7.5 కోట్ల నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని సూద్ పేర్కొ న్నారు.
ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో పివిఆర్ థియేటర్లున్నాయి.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







