కతర్ రైల్వే నియామకాలు చేపట్టినట్లు ఫేస్బుక్ లో నకిలీ ప్రకటన

- March 30, 2017 , by Maagulf
కతర్ రైల్వే నియామకాలు చేపట్టినట్లు ఫేస్బుక్ లో నకిలీ ప్రకటన

 సామాజిక మాధ్యమాలు కొన్ని అబద్ధాలు పని కట్టుకొని ప్రచారం చేస్తూ పలువురిని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఖతార్ రైల్ ఉద్యోగ నియమాకాలు జరుపుతున్నట్లు సిబ్బంది కావాలంటూ  సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్టు చక్కర్లు కొడుతుంది. అందుకు సంబంధించిన చిత్రం సైతం ఆ ప్రచారంకు మరింత నమ్మకం కల్గించే రీతిలో ఇంటర్నెట్ లో ప్రాచుర్యం పొందింది. కతర్ రైల్వే ఉద్యోగుల మాదిరిగా దుస్తులు ధరించి కొందరు ఆ చిత్రంలో ఒక గుంపుగా నుంచొని  "  ఒక శీర్షిక వాదనలు కతర్ రైల్ ఇప్పుడు కొత్త సిబ్బందిని తీసుకోవటానికి సన్నాహాలు చేస్తుంది " ప్రచారం ఎందరినో ఆకట్టుకొంటుంది. . ఏ జాతీయత వారైనా కతర్ రైల్ సంస్థలో ఉద్యోగాలకు అర్హులని, అలాగే ఏ రంగంలోని వారైనా సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హత కలిగి ఉంటె చాలని ప్రకటించారు..దీనిపై స్పందిన ఖతార్ రైల్ ఆ చిత్రంకు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటన కేవలం నకిలీదని చెప్పారు, తమ కంపెనీని అడ్డం పెట్టుకొని ఈ మోసం వెనుక ఉన్నారని అమాయక ప్రజలు వీటిని నమ్మరాదని తెలిపింది. సామాజిక మాధ్యమాలలో అసత్య వాదనలను  త్రిప్పికొట్టడానికి ఖతార్ రైల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోసపోవద్దని తెలిపింది. తన సంస్థ ఎక్కడైనా ఏ నియామక ప్రకటనలో ఉంచుతారని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతున్న చిత్రం ఒక నకిలీది అని పునరుద్ఘాటించారు. కంపెనీకి చెందిన లోగో లేదా కంపెనీ కంపెనీ యాజమాన్య హక్కుల ఉల్లంఘన అధికారులకు నివేదించారు సంస్థ అనుమతి లేకుండా ఏ కాపీరైట్ ఉపయోగించి వారు ఈ మోసానికి పాల్పడ్డారో చర్యలు తీసుకొంటామని  సంస్థ ప్రతినిధి అరబిక్ లో ట్వీట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com