పివిఆర్‌ సినిమాస్ లక్ష్యం రాబోవు ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు

- March 30, 2017 , by Maagulf
పివిఆర్‌ సినిమాస్ లక్ష్యం రాబోవు  ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు

మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పివిఆర్‌ వచ్చే ఐదేళ్ల కాలంలో రాబడిని రెండింతలు పెంచుకుని 4 వేల కోట్ల రూపాయలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే కాలంలో స్ర్కీన్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 570 స్ర్కీన్లున్నాయని, వచ్చే నాలుగైదేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నామని పివిఆర్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నితిన్‌ సూద్‌ తెలిపారు.
ఈ స్థాయికి చేరితే కంపెనీ రాబడి రూ.3,500-4,500 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పా రు. 2015-16 సంవత్సరంలో కంపెనీ రాబడి 1,743.98 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని సూద్‌ తెలిపారు. మూడేళ్ల కాలంలో స్ర్కీన్ల సంఖ్య ను పెం చడం వల్ల తమ థియేటర్లలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య ప్రస్తుతమున్న 7.5 కోట్ల నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని సూద్‌ పేర్కొ న్నారు.

ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో పివిఆర్‌ థియేటర్లున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com