ప్రభుత్వం ప్రవాసులను ఆదుకోవాలని డిమాండ్
- March 30, 2017
గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన. గల్ఫ్ దేశాలలోని వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం (30.03.2017) న ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి లో జరిగింది. నిర్మల్ జిల్లా ప్రవాసి కార్మిక నాయకుడు పోతుగంటి సాయేందర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కూచంపల్లి కి చెందిన యెలిగాటి రాజేశ్వర్ తేది: 25.02.2017 మస్కట్, ఓమాన్ లో చనిపోయారు. దుబాయిలో ఉంటున్న ఇతని కుమారుడు వచ్చి అంత్యక్రియలలో పాల్గొన్నాడు.
ఓమాన్ లోని సామజిక కార్యకర్తలు లింగన్న, హరిబాబు శవాన్ని ఇండియాకు పంపుటకు కృషిచేశారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండ్ల గంగాప్రసాద్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి కూచంపల్లి శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఈ క్రింది డిమాండ్లతో గ్రామస్థులు శవయాత్రలో పాల్గొన్నారు
'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో వలసదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది ! ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను !
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపకల్పన అయ్యింది.. అమలు నిలిచింది.
గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి.
సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి.
విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలి.
గల్ఫ్ నుండి సంవత్సరానికి 200 మంది తెలంగాణ ప్రవాసీ బిడ్డలు చనిపోతున్నారు
శవపేటికల్లో తెలంగాణకు చేరుతున్నారు. 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు 500 మంది
తెలంగాణ ప్రవాసీ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా ఇంటికి కు చేరుకున్నాయి. రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలి.
ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
వలసవెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి.
కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి.
వలస పోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి రిక్రూటింగ్ వ్యవస్తపై నిఘా ఏర్పాటు చేయాలి.
విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి విడుదల చేయాలి.
ఎం.భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







