మేనేజర్ దొరకలేదని మెయిడ్ ని హత్య చేసిన ఆసియా వ్యక్తి
- March 30, 2017
దుబాయ్:ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి హత్య నేరంలో నిందితునిగా నిరూపించబడటంతో ముద్దాయిని జైలులో 15 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తు దుబాయ్ క్రిమినల్ న్యాయస్థానం ఆదివారంతీర్పు ఇచ్చింది. ఒక కాపలాదారునిగా పని చేస్తున్న ఆ వ్యక్తి ఒక యువతీ మెడపై పలు కత్తిపోట్లు పొడిచి ఆమె అపార్ట్మెంట్ లో హతమార్చినట్లు కనుగొనబడింది. ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెని చంపడానికి యత్నించలేదని ఆవేశంలో అలా జరిగిపోయినట్లు నిందితుడు అంగీకరించాడు.మేనేజర్ తో తనకు ఉన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించడానికి అపార్ట్మెంట్ కి వెళ్లెనని చెబుతూ ఆ వ్యక్తి దొరకకపోవడంతో అందుకు బదులుగా ఆ మహిళను పొడిచినట్లు తెలిపాడు. తనను వెలుపల నిలబెట్టి తలుపు వద్ద మాట్లాడుతున్న ఆ మహిళ తనతో వాదన జరిపిందని , దాంతో ఆమె చేతిని తోసుకొని లోపాలకి వెళ్ళి వంటగదిలోని కత్తి తీసుకొని ఆమె మెడపై కత్తిపోట్లు పొడిచెనని కోర్టుకి విన్నవించుకున్నాడు. .నిందితుని 15 ఏళ్ళ శిక్షా కాలం పూర్తైన వెంటనే దేశమునుండి బహిష్కరించాలని దుబాయ్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







