సెట్స్ పైకి నాగ శౌర్య కొత్త చిత్రం
- March 30, 2017
చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, జో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే, ఒక మనసు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఉహలు గుసగుసలాడే సినిమా మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య కొత్త సినిమాను స్టార్ట్ చేశాడట. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన వెంకి కుడుముల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కన్నడ నటి రిష్మిక మండన్న దీనిలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోలో ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు అమ్మమ్మగారిల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్, దర్శక నిర్మాతల వివరాలు అధికారకంగా తెలుస్తాయి. కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







