'కల్పనా 3' పోస్టర్ ను విడుదలచేసిన రోశయ్య
- March 30, 2017
ప్రియమణి ఈజ్ బ్యాక్. టాలీవుడ్‌లో దశాబ్ధం పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రియమణి కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ తిరిగి వస్తోంది. ఎ. ఉపేంద్ర, కన్యాదానం, సూపర్ వంటి విలక్షణమైన సినిమాలతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవలే 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా తెలుగులో వస్తోంది. ఉపేంద్ర - ప్రియమణి నాయకానాయికలుగా నటించిన 'కల్పనా 3' పోస్టర్‌ని మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య ఉగాది సందర్భంగా నేడు హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. పలు విజయవంతమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏప్రిల్ 21న తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ నటి తులసీ ఓ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆర్. ఉదయరాజ్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







