మలేసియా ప్రధానికి మహ్మద్‌ నజీబ్‌ టున్‌ అబ్దుల్‌ రజాక్‌కు మోదీ ఘనస్వాగతం

- April 01, 2017 , by Maagulf
మలేసియా ప్రధానికి మహ్మద్‌ నజీబ్‌ టున్‌ అబ్దుల్‌ రజాక్‌కు మోదీ ఘనస్వాగతం

భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధానమంత్రి మహ్మద్‌ నజీబ్‌ టున్‌ అబ్దుల్‌ రజాక్‌కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌కు సతీసమేతంగా విచ్చేసిన రజాక్‌ను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రజాక్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత హైదరబాద్‌ భవన్‌లో భేటీ అయిన ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చలు జరిపారు. అక్కడి నుంచి రజాక్‌.. రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు.
ఐదు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్‌ సతీసమేతంగా గురువారం తమిళనాడులోని చెన్నై వచ్చారు.
అదే రోజు తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య, మలేసియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com