రజనీకాంత్ అల్లుడు సినిమా సెట్లో
- April 01, 2017
తన అల్లుడు, హీరో ధనుష్ సినిమా సెట్‌కు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ వెళ్లి సందడి చేశారు. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘వీఐపీ-2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ సినిమా సెట్‌కు వచ్చిన ఫొటోలను సౌందర్య అభిమానులతో పంచుకున్నారు. ‘దీని కన్నా గొప్పదాన్ని పొందలేను. సెట్లో వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ మా నాన్న. ధనుష్‌కు చివరిరోజు షూటింగ్’ అని ట్వీట్ చేశారు.
‘రఘువరన్ బీటెక్’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్. థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమలాపాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!







