ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి
- April 01, 2017
ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి చెందారు. బంగ్లా ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం... రాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ ఇంటెలిజెన్స్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత కోసం సిల్నెత్ ప్రాంతంలో గతవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు సారథ్యం వహించిన ఆర్మీ ఉన్నతాధికారి అబుల్ కలామ్ ఆజాద్ (41) ఉగ్రదాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. సింగపూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆజాద్ మృతిచెందినట్టు శుక్రవారం బంగ్లాదేశ్ సైన్యం ప్రకటించింది. అజాద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!







