హేవళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు
- April 01, 2017
తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలో హేవళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.
ప్రార్ధనాగీతం వందేమాతరం తో కార్యక్రమాలు ప్రారంభమైయాయి. శ్రీ సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ పఠనం చేసారు.
అనంతరం జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాలలో ప్రముఖ వర్ధమాన సినీ నేపధ్య గాయకులు సత్య యామిని (బాహుబలి ఫేం) మరియు డా. అరుణ్ కౌండిన్య (బోల్ బేబి బోల్, సోగ్గాడే చిన్నినాయనా ఫేం) ల పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం, ఏకపాత్రాభినయం, సంసృత భాషలో చేసిన స్కిట్, భగవద్గీత శ్లోకాలు, ఖురాన్ సురాలు, మరియు సినిమా నృత్యాలు అందరినీ మాత్రముగ్ధులను చేసాయి. శ్రీ ముసునూరి మురళీకృష్ణ శర్మ, శ్రీమతి ఓబ్బిలిసెట్టి అనూరాధ నిర్వహించిన తంబోలా అందరిని ఆకట్టుకుంది.
యు.ఎ.ఇ లోని సుమారు 1000 మంది తెలుగువారు ఉగాది పచ్చడి, విందు భోజనం, ఆటలు, పాటలు మరియు ఇతర వినోద కార్యక్రమాలతో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వన పలికారు.
అనేకవేల తెలుగు వారికి దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించి , తెలుగు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ దువ్వురి కిషోర్ బాబు ని "ప్రవాసి తెలుగు మిత్ర" ఉగాది పురస్కారంతో తెలుగు తరంగిణి సత్కరించింది.
అధ్యక్షులు శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్, ఉపాద్యక్షులు శ్రీ సాయి కృష్ణ మోహన్ ముసునూరి, కార్యదర్శులు శ్రీ కోకా సత్యానంద రావు, శ్రీ సి. హెచ్. శ్రీనివాస్, శ్రీ చామర్తి రాజేష్ ల ఆర్ధ్వర్యంలో తెలుగు తరంగిణి సభ్యులు రవిశంకర్, వెంకి, వీర, వంశి, శివానంద్, సైదా, కిరణ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలగా వ్యవహరించిన శ్రీ వలేది సుజన్, శ్రీమతి ముసునూరి గౌరీ మైథిలి ల వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ గోపిక్రిష్ణ , అస్టర్ మెడికల్ సెంటర్ సి యి ఓ శ్రీ గోపీనాథ్, శ్రీమతి మాలా గోపీనాథ్, శ్రీ దువ్వురి కిషోర్ బాబు, శ్రీమతి దీపిక కిషోర్ బాబు, శ్రీ తులసీ ప్రసాద్ చిన్నారులను ఆశీర్వదించి ప్రశంసా పత్రం మరియు బహుమతి ప్రదానం చేసారు.
భారత జాతీయ గీతం జన గణ మణ తో కార్యక్రమాలు ముగిసాయి.
రస్ అల్ ఖైమాలో జరిగిన ఈ కార్యక్రమానికి మాగల్ఫ్, TV5, SVBC మీడియా సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో రవి కుమార్,డా.ముక్కు తులసి కుమార్,శ్రీకాంత్ చిత్తర్వు,సురేష్ ఒబ్బిలిశెట్టి ,కేసరి త్రిమూర్తులు,రవి కొమర్రాజు,జాఫర్ అలీ,జంధ్యాల పద్మజ,లక్ష్మి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.









తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







