ప్రభుదేవా కొత్త మూవీ షూటింగ్ లో ఘోర ప్రమాదం

- April 01, 2017 , by Maagulf
ప్రభుదేవా కొత్త మూవీ షూటింగ్ లో ఘోర ప్రమాదం

ప్రముఖ నటుడు & దర్శకుడు అయిన ప్రభుదేవా కొత్త చిత్ర షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా ఈ మూవీ షూటింగ్ ను కుంభకోణం పరిసర ప్రాంతాల్లో రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకుంటోంది. తిరువయ్యారు లోని ఓ దేవాలయం వద్ద షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్ సభ్యులు కొందరు ఓ వాహనం లో బయలుదేరారు. మధ్యలో వీరి వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ వార్త తెలియగానే తంజావూర్ మెడికల్ ఆసుపత్రికి వెళ్లి ప్రభుదేవా బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుదేవా చిత్ర యూనిట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 4 గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com