రాంచరణ్ అయ్యప్ప దీక్షలో
- April 01, 2017
హీరో రాంచరణ్‌కి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనే ముందు ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి రావడం ఆయనకు అలవాటు. హీరోగా 'ధృవ', నిర్మాతగా 'ఖైదీ నం. 150' చిత్రాలతో భారీ విజయాల్ని అందుకున్న ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్లో శనివారం నుంచి పాల్గొంటున్నారు.
దాదాపు నలభై రోజులపాటు ఔట్‌డోర్‌లోనే ఉండాల్సిరావడంతో నియమనిష్టలతో ఈ షూటింగ్లో పాల్గొనాలని ఆయన మూడు రోజుల క్రితమే అయ్యప్ప మాల వేసుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాంచరణ్ సోదరి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి నటించిన 'ఖైదీ నం.150' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుస్మిత ఇప్పుడు తమ్ముడు హీరోగా నటించే చిత్రానికి పనిచేయడం ఇదే ప్రధమం. ఫ్లైట్‌లో రాజమండ్రికి బయల్దేరిన రెండు ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకన్నారు.
'సుకుమార్ సినిమా కోసం రాజమండ్రిలో ల్యాండ్ అయ్యాం' అని రాంచరణ్ తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆపద్భాంధవుడు' చిత్రం షూటింగ్ జరిగిన గోదావరి లంకగ్రామమైన పూడిపల్లిలోనే రాంచరణ్ తాజా చిత్రం షూటింగ్ జరుగుతుండడం గమనార్హం.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







