'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' మినీ టీవీ సీరీస్‌గా

- April 01, 2017 , by Maagulf
'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' మినీ టీవీ సీరీస్‌గా

యావన్మంది సినిమా ప్రియులను తెలుగు చిత్రసీమ వైపు తిరిగి చూసేలా చేసిన చిత్రం 'బాహుబలి'. ఈ వేసవికి 'బాహుబలి-2' (బాహుబలి ది కన్‌క్లూజన్) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత ఆనంద్‌ నీలకంఠన్ ఈ చిత్ర కథకు ముందస్తు ఘట్టాలతో (ప్రీక్వెల్‌) మూడు భాగాల పుస్తకం 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' రాస్తున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఓ మినీ టీవీ సీరీస్‌ను రూపొందించనున్నట్లు దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి ప్రకటించారు. ఈ మూడు పుస్తకాల సీరీస్‌లో తొలిపుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''మన డైలీ సీరియళ్లకు భిన్నంగా 13 ఎపిసోడ్లతో ఈ మినీ టీవీ సీరీస్‌ను రూపొందించాలనుకుంటున్నాం.
నీలకంఠన్ గారు రాసిన 'అసుర' పుస్తకాన్ని కూడా చదివాను. అందులోని ప్రతి పాత్రా ఆకట్టుకుంది. 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి'లో శివగామి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా పేపర్‌ మీద పెట్టని ఓ కథను నీలకంఠనగారు నాతో పంచుకున్నారు.
అది బాగా నచ్చింది. భవిష్యత్తులో దాన్ని తెరకెక్కిస్తానేమో చూడాలి. కానీ ఇప్పుడప్పుడే దాని గురించి కచ్చితంగా చెప్పలేను'' అని అన్నారు. ''మాహిష్మతి సామ్రాజ్ఞిగా శివగామి ఎదిగిన వైనాన్ని వివరించడంతో పాటు కట్టప్ప గురించి ఇందులో చెప్పాం.
కట్టప్ప పడిన అంతర్మథనాన్ని అర్థం చేసుకుని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను'' అని రచయిత నీలకంఠన్ తెలిపారు. ఈ పుస్తక త్రయం కోసం రచయిత సినిమా కథలో లేని దాదాపు 40 కొత్త పాత్రల్ని సృష్టించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com