భారత్ విమానాశ్రయాల్లో కొత్త మార్పు
- April 02, 2017
త్వరలో భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లోకి ఫుల్ బాడీ స్కానర్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న తడిమి తనిఖీ చేసే పద్ధతి స్థానంలోకి ఈ కొత్త స్కానర్లతో తనిఖీలు రానున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గతంలోనే ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీటిని పరీక్షించి చూశారు. దేశంలోని పలు వాణిజ్య పరమైన విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ మాత్రమే సెక్యూరిటీ చూస్తుంటుంది. అయితే, అప్పట్లో ఈ స్కానర్లు బాగానే పనిచేసినప్పటికీ పలువురు ప్రయాణీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పారు.
ముఖ్యంగా భారతీయ మహిళలు ధరించే తాళి, ఎక్కువ మడతలు ఉండే చీరలాంటివాటిని స్కానింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో ఈ ఐడియాకు ఎక్కువమంది అనుకూలంగా లేరని అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఫుల్ బాడీ స్కానర్లు తప్పక అన్ని విమానాశ్రయాల్లో అవసరమేనని భావిస్తున్నామని వాటిని త్వరలోనే ప్రవేశపెడతామని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. విమానాల్లోని ప్రయాణికుల క్యాబిన్లోకి ల్యాప్‌టాప్‌ను నిషేధించే అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో అమెరికా, బ్రిటన్ విమానాల్లోకి ల్యాప్ టాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







