బాలయ్య కోసం పూరి భారీ మార్కెట్ సెట్

- April 04, 2017 , by Maagulf
బాలయ్య కోసం పూరి భారీ మార్కెట్ సెట్

బాలకృష్ణ - పూరి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని , ఏప్రిల్ 6 నుండి రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది. నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్లో బాలయ్య, హీరోయిన్ ముస్కాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం 1. 5 కోట్ల రూపాయల వ్యయంతో భారీ కాలనీ, మార్కెట్ సెట్ ను రూపొందించారు.
మొదటిసారిగా బాలయ్య ను పూరి డైరెక్ట్ చేస్తుండడం తో అభిమానుల్లో బాలకృష్ణ ను ఎలా చూపిస్తారో అనేఆసక్తి పెరుగుతుంది .
షూటింగ్ ఆరంభంలోనే పూరి బాలయ్యను అభిమానులు మెచ్చేలా చూపిస్తానని మాటివ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పూరి గత సినిమాలు 'టెంపర్, హార్ట్ ఎటాక్' లకు సూపర్ హిట్ సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ ఇవ్వనున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com