ఏపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకొన్నందుకు కృతజ్ఞతలు - వాణిశ్రీ
- April 04, 2017
తెలుగు చిత్ర పరిశ్రమలో నవలా నాయికగా వాణిశ్రీ ది ఓ ప్రత్యేక స్థానం.. చెలికత్తెలా... చెల్లెలుగా.. వెండి తెరపై చిన్న పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న వాణిశ్రీ హీరోయిన్ గా తనకంటూ ఒక శాకాన్ని క్రియేట్ చేసుకొన్నది. ఇక ఆ రోజుల్లో వాణిశ్రీ ఫ్యాషన్ కు ఐకాన్.. వాణిశ్రీ కట్టు, బొట్టు, జుట్టు అని అనుకరికరించడానికి ఆ రోజుల్లో ఆడవారు మళ్ళీ మళ్ళీ సినిమాలు చూసిన సందర్భాలున్నాయి.. ఎన్టీఆర్ హీరోగా నటించిన మంగమ్మ శపధం సినిమాలో వాణిశ్రీ రాజైన రామరావుకు చెలికత్తెగా నటించింది.. తర్వాత కాలంలో అదే రామరావుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో జోడీ గా నటించింది.. అగ్రహీరోలు సైతం వాణిశ్రీ తమకు జోడీగా నటించాలని కోరుకొనేవారు.. కాగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన వాణిశ్రీ సినీ ప్రయాణం సుదీర్ధం..లో అందుకొన్న అవార్డులు తక్కువే అని చెప్పవచ్చు.. తాజాగా ఏపీ ప్రభుత్వం వాణిశ్రీ కి ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య నాయుడు" అవార్డ్ ను ఇవ్వనున్నది. ఈ నేపద్యంలో ప్రతిష్టాత్మకమైన రఘపతి వెంకయ్య అవార్డ్‌కు నన్ను ఎంపిక చేసినందుకు ఆనందంకంటే వాణిశ్రీ అనే ఒక ఆర్టిస్ట్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తు పెట్టుకొన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు .. అంతేకాదు 50 ఏళ్ల కెరీర్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అద్భుత పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన దర్శకులు, నిర్మాతలు కళ్లముందు కదలాడుతారు. సినీరంగం అనేది ఒక తీపి పదార్థంలాంటిది. ఒకసారి తినడం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ మళ్లీ తింటూనే ఉండాలనిపిస్తుంది. నేను మాత్రం కొంత రుచి చూసిన తర్వాత ఇక చాల్లే అని వెనక్కి వెళ్లిపోయాను. నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే ప్రయత్నించాను కానీ అవార్డుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. డబ్బులిచ్చి కొనుక్కొనే అవార్డులు నాకు అవసరం లేదనుకొన్నాను.. వాటికి దూరంగా ఉన్నాను. డబ్బు పెట్టి అవార్డులు కొనుక్కోవాలంటే 15 ఏళ్ల కిత్రమే ఆ పని చేసేదాన్ని. ఏ అవార్డ్ లేకుండా ఉండగలగడం కూడా నా దృష్టిలో గొప్ప విషయమే." అని వాణిశ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









