క్యామెల్ ఫెస్టివల్లో డ్రగ్ ట్రాఫికర్స్ అరెస్ట్
- April 05, 2017
హైల్: రమాహ్ రీజియన్‌లో జరుగుతున్న కింగ్ అబ్దుల్ అజీజ్ క్యామెల్ ఫెస్టివల్లో ఇద్దరు వ్యక్తుల్ని అనుమానాస్పదంగా గుర్తించిన ఫీల్డ్ పెట్రోల్స్ సిబ్బంది, వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 80 నార్కోటిక్ పిల్స్‌ని, హాషిస్ మరియు పెద్ద మొత్తంలో సొమ్ముని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి కల్నల్ ఫవాజ్ అల్ మైమాన్ మాట్లాడుతూ, ఫెస్టివల్ భద్రత విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామనీ, అందులో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని చెప్పారు. ఇంకో వైపున, రియాద్‌లోని కింగ్ ఖాలెద్ యూనివర్సిటీ హాస్పిటల్లో వ్యక్తిని తుపాకీతో కల్చిన సౌదీ జాతీయుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. లైసెన్స్ లేని హ్యాండ్ గన్‌తో నిందితుడు కాల్పులు జరిపాడు. ఇద్దరి మధ్యా వివాదం నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్‌మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









