బాలీవుడ్ నటుడు అమితాబ్ ట్వీట్ ఎంత పనిచేసింది
- April 06, 2017
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆస్పత్రిలో ఉన్న ఫొటో ఒకటి బయటికి రావడంతో ఖన్నా ఆరోగ్య విషయం గురించి బాలీవుడ్‌లో ఆందోళనకరంగా మారింది.వినోద్ ఖన్నాకి క్యాన్సర్ అని వార్తలు వెలువడగానే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ట్విటర్‌లో ఓ మెసేజ్ పెట్టారు. ‘మన కుటుంబీకులు, స్నేహితులుచనిపోయినప్పుడు మనమెంత కాలం బతుకుతామో అని ఆలోచిస్తుంటాం. చాలా విచిత్రంగా ఉంది కదా’ అని ట్వీట్ చేస్తూ తాను దిగాలుగా ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేశారు.
వినోద్ ఖన్నా, అమితాబ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు. దీంతో అమితాబ్ పెట్టిన మెసేజ్ వైరల్‌గా మారింది.
అది చూసి చాలా మంది వినోద్ ఖన్నా చనిపోయారనుకుని ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారట. ఆ తర్వాత వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని భయపడాల్సిన పనిలేదని మీడియా ద్వారా వెల్లడించడంతో అంతా కుదుటపడ్డారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







